The hand on my head...in memory of my peddananna garu

      చరిత్రలో క్రీస్తు పూర్వం , క్రీస్తు శకం అని చెప్పుకున్నట్టు నాకు మా చిన్న పెద్దనాన్నగారి జ్ఞాపకాలు ఘరానా మొగుడు సినిమా పూర్వం, ఘరానా మొగుడు సినిమా తరువాత అని చెప్పచ్చు .  ఆ సినిమాకి ముందు ఉన్న జ్ఞాపకాలన్నీ నాకు వేరే వాళ్ళు చెప్పినవే - personal first hand recollection లేదు. నేను చిన్నప్పుడు బాగా తినేదాన్ని అని, నా పొట్ట నాకు తెలిసేదు కాదు అని , పెద్ద నాన్నగారు నాకు ఎంత అన్నం తినిపిస్తే అంత తినేసి ఆయాస పడుతూ లేవలేక లేస్తూ , “తాటి ముంజులు వస్తే నన్ను లేపండి” అని చెప్పేదాన్ని అని అమ్మ వాళ్ళు చెప్తూ ఉండే వాళ్ళు. 

నా జ్ఞాపకాలు 1992 నుండి మొదలవుతాయి. 1992 లో సెలవుల్లో శ్రీకాకుళం లో పెద్ద నాన్నగారు, దొడ్డమ్మ అందరితో కలిసి చిరంజీవి ఘరానా మొగుడు సినిమాకి వెళ్లడం బాగా  గుర్తుంది. ఆ సినిమా చూసినప్పటి నుండి ఆయన నన్ను “ఘరానా” అని పిలవడం మొదలు పెట్టారు. I have neither Chiranjeevi’s swag nor Nagma’s arrogance as portrayed in that movie. Yet, he chose to call me “Gharana” and I have no idea why even to this day. ఎందుకు నన్ను అలా పిలుస్తారు అని అడిగితే అదంతే, నువ్వు ఘరానావే  అనేవారు. 

నన్ను ఘరానా అని పిలవడమే కాక ఎందుకో తెలీదు నా మీద చాలా నమ్మకం కూడా ఉండేది ఆయనకి. 10th లో school first, B.Tech లో seat, ఏది సాధించినా “అది మా ఘరానా అంటే “ అని చాలా గొప్పగా అనేవారు. Especially in Indian culture, where parents don’t praise children openly for fear of spoiling them, I found it very refreshing to hear him shower lavish praise on me.


I can’t recall how or where I picked up English words or Telugu words, but my vocabulary also seemed to be a source of pride to him. Even though we lived in different cities, we would race to solve the Telugu crossword puzzle in Eenadu Sunday edition, and we would call each other up to check our answers. My move to the US, my getting a job, my quitting a job, my volunteering in Manabadi, anything and everything was met with the standard “మా ఘరానా ఏమి చేసినా కరెక్టే “ from peddananna garu. It was not that I couldn’t do anything wrong, it was as if whatever I did was the right thing in his eyes. I wish I had told him that his unwavering faith in me filled me with abundant confidence. His trust in me was the hand on my head that let me choose any path without doubting myself.


శ్రీకాకుళం లో ప్రసాద రావు గారు అంటే తెలియని వాళ్లు ఉండరేమో. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేవారు, ఎప్పుడూ ఎవరో ఒకరు ఎదో ఒక ప్రశ్న తో, సమస్య తో, లేదా మాట్లాడటానికో వస్తూనే ఉండేవారు. 


అలాగే ఆయన పరిచయం ఉన్న వాళ్లందరికీ అయన రామభక్తి కూడా తెలిసే ఉంటుంది. “మా రాముడు, మా రాముడు” అంటూ ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరిలో రామాలయానికి వెళ్లిపోయే వాళ్ళు. హనుమంతుడి తరువాత రాముడంటే అంత అపారమైన ప్రేమ, ఇష్టం మా పెద్దనాన్నగారికే ఉండుంటుంది. అందుకే చివరి క్షణాల్లో కూడా ఆయన రామ నామం వింటూనే పోయారు. మంచి రోజు మంచి ముహూర్తం చూసుకొని, అలా రామ నామం వింటూ దైవ సన్నిధి కి చేరే అదృష్టం ఎంత మందికి ప్రాప్తం ఉంటుంది ?


పెద్ద నాన్న గారు లేని మొదటి శ్రీ రామ నవమి రోజు, ఆయన చేసే హడావిడి లేక మనకి వెలితిగా ఉన్నా , ఆయన తన రాముడికి మరింత దగ్గరలో ఉండి మురిసిపోతూ అక్కడ రాముడికి ఏ కొరతా లేకుండా బ్రహ్మాండంగా పండుగ జరుపుతూ ఉంటారు. I can imagine pedda nannagaru’s glowing face in Lord Rama’s abode. And I have no doubt Rama’s face must be glowing as well, having his true and loyal devotee by his side. 


That’s the image I will hold on to and cherish.


Comments

Popular Posts