A rhyming Telugu poem

 I'm a huge fan of Dr.Seuss's books, having read many of them countless times to my kids. Here is a simple Telugu poem I penned for my Telugu class students hoping to inspire them.

................................

పని - సునీత ఉపాధ్యాయుల


శనిలా చుట్టుకుందనిపించే పని
ఎంత చేసినా ఎడతెరగని పని
ఈ పనితో నాకేంటి పని
అని నాకు నేను చెప్పుకుని
హాయిగా తిని పడుకుని
తనివితీరా ఆడుకుని
వదిలేద్దామనుకున్నా కానీ
ఎక్కడో మనసుమూలలో అంతర్ధ్వని
చెయ్యకపోతే ఈ పని
తప్పదని తెలుసు నాకు హాని
పూర్తి చేసేస్తే అవతలి అంచునుంది గని
ఇలా నాకు నేను బుద్ధి సర్ది చెప్పుకుని
మొదలు పెట్టా నా పని.
పట్టింది నా బ్రతుకు కొత్త బాణి!
-----------
తెలుగంటే అదేదో పెద్ద పని కాదని
it can be simple and funny అని
నా క్లాసు పిల్లలని ప్రోత్సహిద్దామని
ఏదో ఆశతో వ్రాసేసా పై పద్యాన్ని.
చివరిదాకా చెవులప్పగించి విని
భలే ఉందని చప్పట్లు కొట్టారు కానీ
అన్నారు “పరీక్షకి చదవలేక ఛస్తున్నాం.ఇంక కవితలేం వ్రాస్తాం?” అని!
వార్నీ!!!


Comments

Popular Posts