For my Manabadi students

It’s almost that time. Another batch of my students that I’ve literally had from అ ఆ లు to ఛందస్సు will graduate this year from Manabadi. The transformation over the years is always fascinating to witness. And so this is for all of my students, past and present. If they put their minds to it, this is the message they’d want to convey ( I hope). There’s no meter or format to it - just a bunch of thoughts with a dash of pride about what these kids accomplished. The best part of this writing was when they heard it and appreciated it because they could understand all of it :)

మనబడి పిల్లలం 

పిల్లలం తెలుగు పిల్లలం ; మేము తెలుగు తల్లికి ముద్దు బిడ్డలం.

పిల్లలం బడి పిల్లలం ; మేము మనబడి విద్యార్థులం.

ప్రవేశం ప్రసూనం ప్రకాశం ప్రమోదం ప్రభాసం

అంటూ అ ఆ ల నుండి ఛందస్సు వరకు కాచి వడ పోసాం

పిల్లలం పిల్లలం మేము మనబడి పిల్లలం!


తెలుగు పూదోట లో విరిసే పువ్వులం

అచ్చులు, హల్లులు, గుణింతాలు , ఒత్తులు ,

తిథులు , రోజులు, చైత్రం వైశాఖం మొదలగు నెలలు

భాషా భాగాలు, లింగాలు, కాలాలు, వచనాలు

వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు, సంధులు, సమాసాలు

ఇవన్నీ టక టక వల్లించేస్తాం ; మాకివి సులభ సాధ్యం

తెలుగు భాషా సేవకులం; మా మాతృ భాషకై పోరాడే సైనికులం

పిల్లలం పిల్లలం మేము మనబడి పిల్లలం!

ప్రాచీన సాహిత్యం ఆధునిక సాహిత్యం కాదేదీ మాకు కష్టం.

వేమన శతకం నుండి పారిజాతాపహరణం వరకు మాకు కంఠస్థం.

ఆది కవి నన్నయ నుండి నేటి కవి శ్రీశ్రీ వరకు ఎవరినీ మరువం.

ఎందరో మహానుభావులు వారందరికీ మా వందనం.

పిల్లలం పిల్లలం అమ్మ ఒడి నుండి మనబడి వరకు విద్యార్థులం.

అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మురిసిపోయే భాషా జ్ఞానం మా సొంతం.

మేము మనబడి పిల్లలం భావి తరం తెలుగు రాయబారులం !

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ దిక్కునున్నా ఎప్పటికీ తెలుగు పౌరులం.

తెలుగు మరిస్తే అమ్మను మరచినట్టే అంటాం.

మేము సైతం తెలుగు భాషకి మా వంతు ఉడతా సాయం.

నిండుగా వెలిగే తెలుగు భాషా దివ్వెలం ,

అమ్మ నాన్నలకు మేము గర్వ కారణం ,

మేము తెలుగు వెలుగు కిరణాలం .

మేమే తెలుగు భాష ఆశా జ్యోతులం,

మేము కూడా తెలుగు తల్లికి ముద్దు బిడ్డలం ,

మేము తెస్తాం తెలుగు కి రెండో స్వర్ణ యుగం !!

Comments

Popular Posts